Header Banner

మరో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్! బయటకు అసలు రావద్దు ..

  Wed Apr 23, 2025 16:00        Environment

ఇంకా మే నెల రాలేదు. అయినప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుజామున 5:30 నుంచే సూర్యుడు ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు మండుటెండలతో వచ్చేస్తున్నాడు. ఉదయం 5:30 నుంచి వేడి వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్ ఉమ్మడి గోదావరి జిల్లాలో వేసవి వేడి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. అటు రాయలసీమ జిల్లాల్లోనూ మెల్లగా వాతావరణం వేడెక్కుతోంది. మే మొదటి వారం వరకూ ఈ ఎండలు ఇలా కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కె.ఎస్. శ్రీనివాస్ వివరించారు. మొన్న ఆదివారం నుంచి సూర్యుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 5:30 నుంచే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ముఖ్యంగా సండే నిజంగానే "సన్ డే" లాగే కనిపించింది. తర్వాత మండే కూడా పూర్తిగా మండిపోయింది. అటు మంగళవారం అంటే నిన్న కూడా ఇదే వేడి వాతావరణం విశాఖపట్నంలోనూ, ఇతర జిల్లాలోనూ కనిపించింది.

 

ఇది కూడా చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా ఆసక్తిని రేపుతున్న కంటెంట్! ఆ గ్రామంలో చిత్రమైన..

 

పూర్తిగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా భగభగలు తగ్గటం లేదు. ఆ తర్వాత కూడా సాయంత్రం 6:00 వరకు వాతావరణం చల్లబడటం లేదు. ఇక రాత్రి అయ్యే సరికి కాస్త రూరల్ ప్రాంతాల దగ్గర, కాస్త చెట్ల కింద ప్రాంతాల్లో చల్లగా అనిపిస్తుందే తప్ప మిగతా నగరం అంతా కూడా వేడిగా ఉంటోంది. ఇక బుధ, గురువారాలలో రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం 17, మన్యం 13, శ్రీకాకుళం 7, అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీవ్రమైన ఎండ కారణంగా, వాతావరణంలో మార్పులు ఏర్పడి క్యుములోనింబస్ మేఘాలతో ఉరుములు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations